కోలీవుడ్ హీరోలు జయం రవి, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన తమిళ సూపర్‌హిట్ చిత్రం 'బోగన్'. ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్ధమైంది. రామ్ తాళ్లూరి ఈ సినిమా తెలుగు హక్కులను ఇటీవలే సొంతం చేసుకున్నారు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'బోగన్' ట్రైలర్‌ను సోషల్‌మీడియాలో రిలీజ్ చేసింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అత్యాధునిక సాంకేతికతతో విజువల్ ట్రీట్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఫ్రేమ్‌లోనూ ఉత్కంఠ కలిగిస్తోందీ ట్రైలర్. ప్రారంభంలో కథానాయకులిద్దరూ భాగస్వాములుగా కనిపిస్తారు. తర్వాత ఒకరిపై ఒకరు పోరాటానికి దిగుతారు. విక్రమ్, ఆదిత్య అనే పేర్లు వినిపిస్తాయి.
హన్సిక హీరోయిన్గా నటిస్తుండగా.. లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. డి. ఇమాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధానబలంగా నిలుస్తోంది. బుధవారం కేంద్రప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో సినిమాహాళ్లకు అనుమతివ్వడం వల్ల ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.