ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ లాంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా కృష్ణవంశీ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన కొత్త చిత్రానికి 'అన్నం' టైటిల్ పెట్టడం సహా ఇటీవల లుక్ను విడుదల చేశారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే పలు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తీయబోతున్నారని ప్రచారం జరిగింది. అవి కేవలం పుకార్లంటూ కృష్ణవంశీ స్పష్టం చేశారు.

ఇవన్నీ ఇలా ఉండగా.. మరో క్రేజీ న్యూస్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లోనైనా నిజం ఉందో తెలియాలంటే కృష్ణవంశీ లేదా రెహమాన్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.