ETV Bharat / sitara

రెహమాన్ కుమార్తె ఎంగేజ్​మెంట్​.. వరుడు ఎవరంటే? - ఖతీజా రెహమాన్

AR Rahman Daughter: దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్​ రెహామాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ ఎంగేజ్​మెంట్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఖతీజానే సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.

AR Rahman Daughter
ఏఆర్​ రెహామాన్
author img

By

Published : Jan 2, 2022, 7:34 PM IST

AR Rahman Daughter: మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్​ రెహమాన్ పెద్ద కూతురు ఖతీజా రెహమాన్ ఎంగేజ్​మెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ఇన్​స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. రియాస్దీన్​ షేక్ మహ్మద్​ అనే వ్యక్తితో డిసెంబర్ 29న తన ఎంగేజ్​మెంట్ జరిగిందని తెలిపారు ఖతీజా.

"భగవంతుని దీవెనలతో రియాస్దీన్​ షేక్ మహ్మద్​తో డిసెంబర్ 29న నా ఎంగేజ్​మెంట్ జరిగింది. దగ్గరి బంధువుల సమక్షంలో నా పుట్టినరోజునే ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను."

-ఖతీజా రెహమాన్

రియాస్దీన్​.. ఆంటర్​ప్రెన్యూర్​, ఆడియో ఇంజనీర్​ అని ఖతీజా తెలిపారు. ​ఇక వృత్తిపరంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీతంలోనే రాణిస్తున్నారామె. ఇటీవలే రెహమాన్ స్వరాలందించిన 'మిమీ' చిత్రంలో 'రాక్​ ఎ బై బేబీ' అనే పాటను ఆమె పాడారు.

ఇదీ చూడండి: Khatija Rahman: రెహమాన్​ కూతురికి అంతర్జాతీయ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.