ETV Bharat / sitara

అభిమానులకు మరింత దగ్గరగా స్వీటీ అనుష్క - Anushka Shetty debut on Twitter

తన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ట్విట్టర్​లోకి అడుగుపెట్టింది హీరోయిన్ అనుష్క. ఈమె నటించిన 'నిశ్శబ్దం' శుక్రవారమే 'అక్టోబరు 2'నే ఓటీటీ వేదికగా విడుదలైంది.

Anushka Shetty makes her debut on Twitter
అభిమానులకు మరింత దగ్గరగా స్వీటీ అనుష్క
author img

By

Published : Oct 2, 2020, 7:10 AM IST

Updated : Oct 2, 2020, 7:19 AM IST

దక్షిణాదిలో నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది కథానాయిక అనుష్క. 'అరుంధతి', 'బాహుబలి', 'భాగమతి' లాంటి బడా చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇప్పుడామె తన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ట్విటర్‌ గూటిలోకి అడుగుపెట్టింది.

"అందరికీ నమస్కారం. మీరంతా బాగున్నారని, సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నా. రానున్న రోజుల్లో ఆసక్తికరమైన అప్‌డేట్ల కోసం మీరంతా నా అధికారిక ట్విటర్‌ ఖాతాను అనుసరించండి" అంటూ తన ట్విటర్‌లోకి అభిమానులకు ఆహ్వానం పలికింది అనుష్క.

ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు.

Last Updated : Oct 2, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.