ETV Bharat / sitara

అనుష్కతో నవీన్​ పొలిశెట్టి.. సినిమా ఫిక్స్ - అనుష్క శెట్టి

స్టార్​ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి నటించనున్నాడు యువ హీరో నవీన్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్​ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది నిర్మాణ సంస్థ.

anushka shetty and naveen polishetty movie
అనుష్క శెట్టి
author img

By

Published : Dec 26, 2021, 12:32 PM IST

స్టార్​ హీరోయిన్ అనుష్క శెట్టితో యువ హీరో నవీన్ పొలిశెట్టి సినిమా ఖరారైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​. ఈ సినిమా గురించి ఇదివరకే పలు ఊహాగానాలు వచ్చాయి. నేడు (డిసెంబర్ 26) నవీన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని అతడి పోస్టర్​ను విడుదల చేసిన నిర్మాణ సంస్థ.. సినిమా ఉంటుందని స్పష్టతనిచ్చింది.

anushka shetty and naveen polishetty movie
నవీన్​ పొలిశెట్టి

2020లో వచ్చిన 'నిశ్శబ్దం' తర్వాత వెండితెరపై కనిపించలేదు అనుష్క. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమాతోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ఏడాది వచ్చిన 'జాతి రత్నాలు' చిత్రంతో బంపర్​ హిట్​ అందుకుని జోరు మీదున్నాడు నవీన్.

ఇదే కథ?

40 ఏళ్ల మహిళను 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

అనుష్క

ఇదీ చూడండి: నా జీవితాన్ని ఇంతలా మార్చింది రాజమౌళినే: ఎన్టీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.