ETV Bharat / sitara

భర్త కోహ్లీతో కలిసి అనుష్క మంచిపని! - అనుష్క కోహ్లీ లేటేస్ట్ న్యూస్

భర్త విరాట్​ కోహ్లీతో కలిసి త్వరలో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టబోతున్నట్లు అనుష్క శర్మ చెప్పింది. ఈ వీడియోను తన ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

Anushka Sharma Virat Kohli news
అనుష్క శర్మ
author img

By

Published : May 2, 2021, 9:45 PM IST

బాలీవుడ్‌ నటి, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ మే 1న 33వ వసంతంలోకి అడుగుపెట్టింది. పుట్టినరోజు వేడుకలు నిర్వహించకపోవడానికి గల కారణాలను ఆమె ఓ వీడియోలో వెల్లడించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. అందుకోసం అందరం కలిసి పోరాడాలని పేర్కొంది.

'నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మన చుట్టూ విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జన్మదిన వేడుకలు చేసుకోవడం సరైంది కాదనిపించింది. మీరంతా సురక్షితంగా ఉండండి. నా భర్త విరాట్‌ కోహ్లీతో కలిసి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ కష్టకాలంలో దేశంలోని పేదలను ఆదుకోవడమే ఆ కార్యక్రమ ఉద్దేశం. అందుకు మీరూ కలిసి రావాలని కోరుతున్నా. అందరం కలిసి పోరాడుదాం' అని అనుష్క చెప్పింది. విరాట్‌ కోహ్లీ కూడా ఈ ఏడాది కరోనాను దృష్టిలో పెట్టుకొని తన భార్య అనుష్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.