దక్షిణాదిలో నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే గుర్తుకొచ్చే కథానాయిక.. అనుష్క. అయితే ఆమె సోలోగా చేసిన సినిమాలు ఎక్కువగా థ్రిల్లర్ కథలతోనే తెరకెక్కాయి.
ఇటీవల ఆమె చేసిన 'భాగమతి', 'నిశ్శబ్దం' సినిమాలు అలాంటివే. ఇప్పుడామె మార్పు కోరుకొంటోంది. కుటుంబ కథల్లో నటించడానికి మొగ్గు చూపుతోంది. యు.వి.క్రియేషన్స్‌లో ఆమె త్వరలోనే ఓ కుటుంబ కథా చిత్రం చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి : ఆమె వద్దంటే అనుష్క 'అరుంధతి'గా మారింది!