> 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో భాగంగా ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మొక్కలు నాటారు. హీరో నిఖిల్ నామినేట్ చేసిన క్రమంలో గురువారం ఆమె బాచుపల్లిలో మూడు మొక్కలను నాటారు.
> బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. 'భూమి తల్లి' అంటూ తాను పొలంలో పనులు చేస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
> గురువారం 'కేజీఎఫ్' హీరో యశ్ పెళ్లిరోజు. ఈ సందర్భంగా అతని భార్య రాధికాపండిట్ వాళ్లిద్దరి ఫొటోను పంచుకుంది.
> సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 14మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో ప్రకటించింది.
> సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'కపటధారి'. శుక్రవారం (డిసెంబరు 11) సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి తొలి లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేయనుంది.