నవతరం ఆచార వ్యవహారాలన్నీ వినూత్నంగా ఉంటాయి. వారి ఆలోచనల్లోనూ ఆధునికత కనిపిస్తుంటుంది. సంస్కృతి, సంప్రదాయాల్ని పట్టించుకునే తీరికే లేదన్నట్లుగా పరుగులు తీస్తుంటారు. కానీ తాను ఆ కోవకు చెందనని అంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. ధరించే దుస్తులు మొదలుకొని, ఇంట్లో పాటించే పద్ధతుల వరకు అన్నింటికీ విలువిస్తానని చెబుతోందీ ముద్దుగుమ్మ.
"నేనూ నవతరం అమ్మాయినే. వృత్తిలో భాగంగా ఎంతోమందిని కలుస్తున్నా. చేస్తున్న పాత్రల కారణంగా కొత్త జీవితాల్లోకి తొంగి చూస్తున్నా. కానీ ఎప్పుడూ నా వ్యక్తిగత జీవన శైలి మారలేదు. హీరోయిన్ కాకముందు ఎలా ఉండేదాన్నో ఇప్పుడూ అంతే. మన ఇళ్లల్లో పాటించే కొన్ని పద్ధతులు, నమ్మకాలు మంచివే. పెద్దవాళ్లు ఏవీ ఊరికే చెప్పరు. అవి క్రమశిక్షణతో కూడిన జీవితానికి దోహదం చేస్తాయి. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా చిత్రీకరణల్లో ఉన్నా, కొన్ని నమ్మకాల్ని పాటిస్తా"
-- అనుపమ పరమేశ్వరన్, నటి
నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాలో ఈమె నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. వీటితో పాటే వివిధ ప్రాజెక్టుల్లో బిజీగా ఉందీ భామ.
ఇదీ చదవండి: అనుకోకుండా సినిమా టైటిల్ చెప్పేసిన మెగాస్టార్