బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి దులారీ ఖేర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన సోదరుడు రాజు ఖేర్‌తో పాటు అతడి కుటుంబానికీ పాజిటివ్ వచ్చింది. వీరు హోం క్వారంటైన్లో ఉన్నారు. అనుపమ్ మాత్రం ఈ మహమ్మారి బారిన పడలేదు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారీ నటుడు.
-
This is to inform all that my mother Dulari is found Covid + (Mildly). We have admitted her into Kokilaben Hospital. My brother, bhabhi & niece inspite of being careful have also tested mildly positive.I got myself tested as well & I have tested negative. @mybmc is informed.!🙏 pic.twitter.com/EpjDIALft2
— Anupam Kher (@AnupamPKher) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is to inform all that my mother Dulari is found Covid + (Mildly). We have admitted her into Kokilaben Hospital. My brother, bhabhi & niece inspite of being careful have also tested mildly positive.I got myself tested as well & I have tested negative. @mybmc is informed.!🙏 pic.twitter.com/EpjDIALft2
— Anupam Kher (@AnupamPKher) July 12, 2020This is to inform all that my mother Dulari is found Covid + (Mildly). We have admitted her into Kokilaben Hospital. My brother, bhabhi & niece inspite of being careful have also tested mildly positive.I got myself tested as well & I have tested negative. @mybmc is informed.!🙏 pic.twitter.com/EpjDIALft2
— Anupam Kher (@AnupamPKher) July 12, 2020
"మా తల్లి దులారీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోదరుడు, అతడి భార్యతో పాటు వారి కుమార్తెకు పాజిటివ్ వచ్చింది. నాకు మాత్రం నెగటివ్‌గా తేలింది."
-అనుపమ్ ఖేర్, సీనియర్ నటుడు
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ముంబయిలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నటి రేఖ సెక్యూరిటీ సిబ్బందికీ కరోనా రాగా ఆమె బంగ్లాను మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు మూసేశారు.