తన మాటలు, పంచ్ డైలాగ్‌లు, చిరునవ్వులతో బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకున్నారు అనసూయ. రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో 'రంగమ్మత్త'గా ఆమె నటన అందరినీ కట్టిపడేసింది. దీంతో అప్పటి నుంచి ఆమె అందరికీ రంగమ్మత్తగా మారిపోయారు. అంతేకాదు, ఆ సినిమా తర్వాత నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రల వైపు అనసూయ మొగ్గు చూపుతున్నారు.
తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రం 'రంగమార్తండ'. 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర ఎంత కీలకమో ఇందులో కూడా ఆ స్థాయిలోనే పాత్ర తీరు ఉంటుందని టాలీవుడ్ టాక్. ఆమె దేవదాసి పాత్రలో కనిపిస్తారని సమాచారం. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు కూడా ఇందులో నటిస్తుండటం విశేషం. లాక్‌డౌన్ కారణంగా కొంతకాలం క్రితం చిత్రీకరణ వాయిదా పడింది. త్వరలోనే పునఃప్రారంభమవుతుంది.