టోక్యో ఒలింపిక్స్ భారత్ తరఫున తొలి పతకం గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బయోపిక్కు రంగం సిద్ధమవుతోందట! ఈ విషయమై బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి స్టోరీలతో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనే సాధించడం వల్ల చాను బయోపిక్కు మరింత క్రేజ్ పెరిగింది!
ఈ సినిమా హక్కుల కోసం చిత్ర నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇందులో కీలకమైన కోచ్ పాత్రలో అక్షయ్ కుమార్, చానూ పాత్రలో ప్రియాంకా చోప్రా నటించనున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం- వెయిట్లిఫ్టింగ్లో రజతం