ETV Bharat / sitara

అనిల్ రావిపూడి పర్యవేక్షణలో 'గాలి సంపత్' - అనిల్ రావిపూడి పర్యవేక్షణలో 'గాలి సంపత్'

యువ నటుడు శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'గాలి సంపత్'. ఈ సినిమాకు ఇప్పటికే స్క్రీన్​ప్లే అందిస్తోన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నట్లు తెలిపారు.

Anil Ravipudi supervises direction for Sree Vishnu starrer Gaali Sampath
అనిల్ రావిపూడి పర్యవేక్షణలో 'గాలి సంపత్'
author img

By

Published : Jan 21, 2021, 9:12 PM IST

యువ నటుడు శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'గాలి సంపత్‌'. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రానికి స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేపట్టారు. గురువారం షూటింగ్‌ స్పాట్‌లో ఆయన యాక్షన్‌.. కట్‌ చెప్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.

ఫ్రేమ్‌లో రాజేంద్రప్రసాద్‌ నటిస్తుండగా, డైరెక్టర్‌ అనీష్‌తో కలిసి కూర్చుని మానిటర్‌ చూస్తున్నారు అనిల్. దీనిపై ఆయన స్పందిస్తూ "గాలిసంపత్‌ సినిమాను ప్రకటించినపుడు నేను కేవలం స్క్రీన్‌ప్లేను మాత్రమే అందిస్తానని చెప్పా. కానీ ఇక నుంచి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నా. సమష్టి కృషి వల్లే పనులు అర్థవంతంగా ఉంటాయని నేనూ ఎల్లప్పుడూ నమ్ముతా" అంటూ రాసుకొచ్చారు.

  • When #GaaliSampath was first announced, I planned to present and write screenplay for the film. This film is extra special for us and now I am extending my complete support by providing direction supervision as well.

    I always believe that team work means more meaningful work !! pic.twitter.com/mmFBnYWYk9

    — Anil Ravipudi (@AnilRavipudi) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వరుస హిట్లతో జోరుమీదున్న అనిల్‌ రావిపూడి ప్రస్తుతం 'ఎఫ్2' సీక్వెల్‌ 'ఎఫ్‌3'ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.