సీనియర్ దర్శకుడు శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనీల్కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మిస్టర్ ఇండియా'. 1987లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో అంబరీశ్ పూరి, శ్రీదేవి, సతీశ్ కౌశిక్ ముఖ్యపాత్రలు పోషించారు. బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించారు.
మళ్లీ 31 ఏళ్ల తర్వాత శేఖర్- అనీల్ కాంబోలో మరో సినిమా రానుంది. అయితే ఈ సినిమా మిస్టర్ ఇండియాకు సీక్వెలా లేదా కొత్త సినిమా అనే విషయాన్ని వీరిద్దరూ స్పష్టం చేయలేదు. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు శేఖర్ కపూర్.
"ఇది తొలి చిత్రానికి సీక్వెలా లేదా కొత్త సినిమా చేస్తున్నామా మీరే చెప్పండి అనీల్ " అంటూ సందేశాన్ని జోడించారు శేఖర్ కపూర్.
" చాలా ఆనందంగా ఉంది. శేఖర్, నేను సినిమా కోసం చర్చిస్తున్నాం. మిస్టర్ ఇండియా లాంటి మరో విజయం ఇంకొకటి రిపీట్ చేయాలనుంది".
--అనీల్ కపూర్, బాలీవుడ్ నటుడు.
2013లో మిస్టర్ ఇండియాకు సీక్వెల్ తీద్దామనుకున్నారు బోనీకపూర్. రెండో భాగంలో సల్మాన్ నటించేందుకు స్రిప్టు సిద్ధమవుతున్న సమయంలో... 2018లో శ్రీదేవీ మరణంతో ఈ సినిమా ఆగిపోయింది.