బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌కు కరోనా సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'జగ్ జగ్ జీయో' సినిమా షూటింగ్ కోసం ఇటీవల చండీగఢ్ చేరుకున్న చిత్రబృందం వైద్య పరీక్షలు చేసుకోగా, అందులో వరుణ్‌తో పాటు నటి నీతూ కపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది.
దీంతో ఆ ముగ్గురూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని సమాచారం. చిత్రబృందం ఇప్పటికే ముంబయి తిరుగు ప్రయాణమయ్యారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్‌కు మాత్రం నెగటివ్‌గా తేలిందని ఓ నివేదిక తెలియజేసింది.
ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్, సీనియర్ స్టార్స్ నీతూ కపూర్, అనిల్ కపూర్, మనీష్ పాల్ ప్రజక్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. నీతూ కపూర్ ఏడేళ్ల తర్వాత తిరిగి నటిస్తున్న సినిమా ఇది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది తీసుకురానున్నారు.
ఇదీ చూడండి: 'ట్రైలర్' కథేంటి? దాన్ని మొదలుపెట్టింది ఎవరు?