కరోనా దెబ్బకు రోజుకో వింత చూడాల్సి వస్తోంది. ఇప్పటికే పక్క వ్యక్తిని పలకరించడానికి రకరకాలుగా, వింతగా అభివాదాలు చేసుకుంటున్నాం. పక్కదేశం నుంచి ఎవరైనా వచ్చాడని తెలిస్తే అతడికి ఆమడ దూరం ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం, వైద్యులు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. అయితే తాజాగా నాలుగు నెలల తర్వాత న్యూయార్క్ నుంచి వచ్చిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సూచనలను ఆచరణలో పెట్టాడు.
శుక్రవారం న్యూయార్క్ నుంచి వచ్చిన అనుపమ్‌ను కలిసేందుకు హీరో అనిల్‌కపూర్ వెళ్లాడు. కానీ వీరిద్దరూ ఇంట్లోకి వెళ్లకుండా బయట నుంచే వీడియోకాల్ ద్వారా పలకరించుకున్నారు.
వీడియోకాల్‌లో అనిల్‌కపూర్ మాట్లాడుతూ.. "ఎలా ఉన్నావు? నీకు మన దేశం ఎలా మర్యాద చేస్తోంది" అని అడిగాడు. "అంతా బాగానే ఉంది. నేను ఇప్పుడు స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రభుత్వ సూచనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. 15 రోజులు పూర్తయ్యాకే బయటికి వస్తాను అప్పుడు కలుద్దాం" అన్నాడు అనుపమ్. 'తేరే ఘర్‌కే సామ్నె' అనే పాట పాడుతూ అనిల్‌కపూర్ సెలవిచ్చాడు.
- View this post on Instagram
#AKseesAK! Keeping up with traditions but from a distance!! #socialdistancing #staysafe @anupampkher
">
ప్రతిఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలంటూ అనుపమ్, అనిల్ కలిసి ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి : వైరల్: విరాట్-అనుష్క జోడీ ఫన్నీ సెల్ఫీ