పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు కూడా సిద్ధంగా ఉంటారు కొంతమంది నటులు. ఇలాంటి సన్నివేశం చేయడానికి ఏ మాత్రం వెనకడారు. ఇప్పుడదే సాహసం చేయబోతుంది నటి ఆండ్రియా!.
మిస్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన తమిళ చిత్రం 'పిశాసు'(తెలుగులో పిశాచి) సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్ర సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. దీని కోసమే ఆండ్రియా బోల్డ్ పాత్రలో నటించనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అతి కొద్ది మంది సమక్షంలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కరోనా వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఇప్పటికే నటి అమలాపాల్ కూడా 'అడై' సినిమాలోని ఓ సన్నివేశంలో బోల్డ్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.
ఇదీ చూడండి: ఆండ్రియా.. నీ అందం అదిరేనమ్మా!