సెలబ్రిటీలకు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ సహజమే. ఎక్కడ మిస్టేక్ జరిగినా దాన్ని పట్టుకుని నెటిజన్లు రెచ్చిపోతుంటారు. హీరోయిన్లు, యాంకర్లకు ఇలాంటి పోస్టుల బాధ తప్పదు. తాజాగా యాంకర్ అనసూయ ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొంది. ఓ నెటిజన్ జబర్దస్త్‌లోని ఓ పాత ఫొటో పెట్టి 'అటెన్షన్ కోరేవారు' అంటూ కామెంట్ చేశాడు. దీనిపై మండిపడింది అనసూయ.
-
Its easy to comment isn’t it? Having punched out two babies and in the process developed low blood pressure and this particular “attention seeking” incident took place at 5:30am where we shot straight for 22 hours.. what exactly do you know to even notice Mr.Aditya..?? https://t.co/FyrR4CW9Ou
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Its easy to comment isn’t it? Having punched out two babies and in the process developed low blood pressure and this particular “attention seeking” incident took place at 5:30am where we shot straight for 22 hours.. what exactly do you know to even notice Mr.Aditya..?? https://t.co/FyrR4CW9Ou
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 7, 2021Its easy to comment isn’t it? Having punched out two babies and in the process developed low blood pressure and this particular “attention seeking” incident took place at 5:30am where we shot straight for 22 hours.. what exactly do you know to even notice Mr.Aditya..?? https://t.co/FyrR4CW9Ou
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 7, 2021
"కామెంట్ చేయడం చాలా తేలిక. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నాకు లో బీపీ వచ్చింది. 22 గంటలు నాన్‌స్టాప్‌గా పని చేయడం వలన ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కళ్లు తిరిగాయి. పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. నన్ను అసభ్యంగా ధూషించాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం వీడియో చూసి ఇలా కామెంట్ చేస్తున్నావా? నిన్ను కూడా అసభ్యంగా ధూషించడానికి నాకు ఎలాంటి సిగ్గు, భయం లేదు. కానీ నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు."
-అనసూయ, యాంకర్
వ్యాఖ్యాతగా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. అక్కడితోనే ఆగిపోకుండా తనలోని డ్యాన్సర్నీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. 'విన్నర్' చిత్రంలో సాయి తేజ్ సరసన చిందేసి వావ్ అనిపించుకున్నారు. ప్రస్తుతం అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్లో మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది.