'జబర్దస్త్' యాంకర్ అనసూయ(jabardasth anasuya).. మరో ఆఫర్ కొట్టేసింది. ఓ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న 'మాస్టర్ ఛెఫ్'(masterchef telugu) కార్యక్రమంలో ఈమెను యాంకర్‌గా ఎంపిక చేశారు. దీంతో ఆ స్థానంలో ఇప్పటివరకూ చేసిన తమన్నాను తప్పించారు. వంటలు, వాటితో పోటీలు ఈ ప్రోగ్రాంలో ఉంటాయి.
యాంకర్‌గానే కాకుండా నటిగానూ పలు సినిమాలు చేస్తోంది అనసూయ. అల్లు అర్జున్ 'పుష్ప'లో(pushpa release date) కీలకపాత్రలో నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి'లోనూ(khiladi ravi teja release date) ఓ పాత్ర చేస్తోంది. వీటి గురించి తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
'పుష్ప'.. ఈ ఏడాది డిసెంబరు 17న థియేటర్లలోకి రానుంది. 'ఖిలాడి'.. వచ్చే ఏడాది లేదంటే ఈ డిసెంబరులోనే ప్రేక్షకుల ముందుకు అవకాశం కనిపిస్తోంది.
ఇవీ చదవండి: