ETV Bharat / sitara

'ఇంట్లోనే దూరంగా ఉంటున్నాం'​ - star heoine news

ఎప్పడూ తీరిక లేకుండా షూటింగ్​లు, సినిమా ప్రచారాలతో బిజీగా ఉండే సినీతారలు లాక్​డౌన్​ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా దెబ్బకు ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. రోజూవారి విశేషాలను సామాజిక మధ్యమాల్లో పంచుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోంది యువ కథానాయిక అనన్యాపాండే. ప్రస్తుతం విజయ్​ దేవరకొండ సరసన నటిస్తోన్న ఈ భామ చెబుతున్న ఆసక్తికర విషయాలు..

ananya pandey shared corona lockdown expereince
ఇంట్లోనే దూరంగా ఉంటున్నామంటున్న యువ హీరోయిన్​
author img

By

Published : Mar 28, 2020, 6:54 AM IST

నిత్యం షూటింగులు, సినిమా ప్రచారాలతో తీరిక లేకుండా గడిపేసే సినిమా తారలు కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన కొందరు స్వీయ నిర్బంధంలో ఉంటే లాక్‌డౌన్‌తో మిగిలిన తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరికి నచ్చిన కాలక్షేపం వాళ్లు చేస్తున్నారు. ఆ విశేషాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచిస్తున్నారు. బాలీవుడ్‌ యువనాయిక అనన్యాపాండే విరామ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం ఈ భామ విజయ్‌దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరెకిక్కిస్తోన్న చిత్రంలో నటిస్తోంది.

‘‘నేను పరిశ్రమలోకి అడుగుపెట్టాకా ఇంతవిరామం ఎప్పుడూ రాలేదు. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. షూటింగుల బిజీతో చాలా పనులు చేయలేకపోయా. ఇప్పుడవన్నీ చేస్తున్నాను. నా సోదరితో కలిసి నాకిష్టమైన కుకీస్‌ వండుతున్నాను. మా కుక్కతో ఆడుకుంటున్నాను. నాకు వర్కవుట్లు చేయడం అంటే చాలా ఇష్టం. కానీ తోడుగా స్నేహితులు ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే వ్యాయామాలు చేస్తూ వీడియో కాలింగ్‌ ద్వారా ఆ ముచ్చట్లు పంచుకుంటున్నాం. నాకు ఒకప్పుడు పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వచ్చింది. నాకు నచ్చిన పుస్తకాల్ని చదివేస్తున్నా’’

-అనన్య పాండే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.