ETV Bharat / sitara

katrina vicky wedding: ఇదేందయ్యా ఇది.. పెళ్లి వీడియోకు 100 కోట్ల ఆఫరా? - katrina kaif vicky kaushal wedding video offer

katrina kaif vicky kaushal wedding: బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ వివాహం డిసెంబరు 9న జరగనుంది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ప్రసారహక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.100కోట్ల భారీ ఆఫర్‌ ఇచ్చిందట. అయితే, ఈ విషయంలో విక్కీ-కత్రిన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

కత్రిన-విక్కీ పెళ్లి, Vicky Katrina Wedding
కత్రిన-విక్కీ పెళ్లి
author img

By

Published : Dec 7, 2021, 10:56 AM IST

katrina kaif vicky kaushal wedding video: బాలీవుడ్‌ ప్రేమ జంట కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్‌ డిసెంబర్‌ 9న వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అయితే, రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్‌ ఫోర్ట్‌ భర్వారాలో జరిగే వీరి వివాహానికి హాజరయ్యే అతిథులకు పలు నిబంధనలు విధించారు. వివాహవేడుకలో ఫొటోలు, సెల్ఫీలు తీయొద్దు.. సోషల్‌మీడియాలో షేర్‌ చేయొద్దని ఆంక్షలు పెట్టారు. దీని వెనుక వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉన్నాయని తెలుస్తోంది.

కత్రిన-విక్కీ పెళ్లి, Vicky Katrina Wedding
కత్రినా కైఫ్​

తాజాగా కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోల ప్రసారహక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 100కోట్ల భారీ ఆఫర్‌ ఇచ్చిందట. అయితే, ఈ విషయంలో కత్రినా-విక్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ ట్రెండ్‌ కొత్తేం కాదు.. గతంలోనూ పలువురు సెలబ్రిటీలు తమ వివాహా ఫుటేజ్‌ల ప్రసారాల కోసం సినీ మ్యాగజైన్లు, ఫొటోగ్రాఫర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే, ఒక ఓటీటీ సంస్థ వివాహావేడుక ప్రసార హక్కులను పొందేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి. ఒకవేళ కత్రినా-విక్కీ ఈ ఒప్పందానికి ఓకే చెబితే.. వారి వివాహాన్ని ఓటీటీ ప్రత్యక్షప్రసారం చేసే అవకాశముంది.

ఇదీ చూడండి: Vicky-katrina wedding: విక్కీ-కత్రినా పెళ్లి.. అబ్బో ఎన్ని విశేషాలో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.