బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు. వివిధ సందర్భాల్లో విభిన్న పద్ధతుల్లో వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ సూరత్‌లో నివసిస్తున్న నీలేశ్ కుమార్ మాత్రం అమితాబ్ ముఖచిత్రాన్ని తన ఛాతీపై టాటూగా వేయించుకున్నాడు. ఈరోజు బిగ్‌బి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఈ పచ్చబొట్టును చూపించనున్నాడు. అచ్చు అమితాబ్లానే ఉండే ఇతడు.. ఈ హీరోను దేవుడిలా కొలుస్తున్నాడు.
ఇటీవలే ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నాడు అమితాబ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'సైరా'లోనూ గోసాయి వెంకన్న అనే పాత్రను పోషించాడు.
ఇది చదవండి: '77ఏళ్ల' యాంగ్రీ యంగ్‌మ్యాన్.. బిగ్‌బి