బాలీవుడు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన ప్రత్యేక నాన్-ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) కలెక్షన్ రూ.7 కోట్లకు అమ్ముడుపోయింది. బిగ్‌బీ 'మధుశాల' సీరిస్‌కు చెందిన ఆటోగ్రాఫ్‌లు, పోస్టర్లు, ఇతర వస్తువులు రూ.7.18 కోట్లు పలికాయి. బియాండ్‌లైఫ్.క్లబ్ అనే సంస్థ నిర్వహించిన ఎన్‌ఎఫ్‌టీ వేలం అత్యంత విజయవంతంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు. వేలంలో కోట్లు కురిపించిన వస్తువులు ఏంటంటే..
- బిగ్‌బీ తండ్రికి చెందిన ఓ కవితను స్వయంగా పాడి రికార్డ్ చేసిన కలెక్షన్ దాదాపు రూ.5.5 కోట్లు పలికింది.
- ఏడు ఆటోగ్రాఫ్‌లు ఉన్న అలనాటి పోస్టర్‌లు దాదాపు రూ.70లక్షలకు అమ్ముడయ్యాయి.
- ఐదు వేల వస్తువులతో కూడిన 'ది లూట్ బాక్స్' కలెక్షన్లో భాగంగా వేలానికి ఉంచారు. దీనిలోని ఒక్కో వస్తువు కనీస ధర రూ.750గా నిర్ణయించగా.. అవన్నీ 54 నిమిషాల్లో అమ్ముడయ్యాయి. ఇందులో అరుదైన పాతకాలపు పోస్టర్‌లు, పలు కళాఖండాలు ఉన్నాయి.
వేలంపై స్పందించిన బిగ్‌బీ.. 'ఇది నిజంగా నాకు చాలా గర్వకారణమైన క్షణం.. అభిమానులు చూపిన ప్రేమ అద్భుతం' అని వ్యాఖ్యానించారు.
"డిజిటల్ ప్రపంచంలో నా అభిమానులతో మరింత చేరువయ్యేందుకు ఎన్ఎఫ్టీలు సరికొత్త అవకాశాన్ని ఇచ్చాయి. నా జీవితంలో, కెరీర్‌లో అత్యంత విలువైన క్షణాలకు సంబంధించిన వస్తువులను నా అభిమానులు స్వీకరించిన తీరు అద్భుతం."
--అమితాబ్ బచ్చన్
నాన్-ఫంజిబుల్ టోకెన్ అంటే?
ఏదైనా డిజిటల్ కళాకృతిని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ రూపంలో నిలువ చేయడాన్ని (ఓనర్‌షిప్ సర్టిఫికేట్) 'ఎన్ఎఫ్‌టీ'గా చెబుతున్నారు. ఫొటోలు, వీడియోలు, ఆడియో ఇతర రకాల డిజిటల్ ఫైల్‌లను ఎన్ఎఫ్టీలను ఉపయోగించి దాచుకోవచ్చు. అయితే.. ఈ విధంగా కొనుగోలు చేసిన ప్రత్యేక డిజిటల్ ఆస్తిని నిజంగా మనచేతికి ఇవ్వరు.!
'రితి ఎంటర్‌టైన్‌మెంట్' 'గార్డియన్‌లింక్.ఐఓ'ల సంయుక్త వెంచర్ అయిన బియాండ్‌లైఫ్.క్లబ్ అమితాబ్‌కు చెందిన ఎన్ఎఫ్టీలను వేలం వేసింది. నవంబర్ 1న ప్రారంభమైన వేలం 4న ముగిసింది.
ఇవీ చదవండి: