ETV Bharat / sitara

బిగ్​బీ, అభిషేక్​.. మరో ఏడు రోజులు ఆసుపత్రిలోనే! - amitab corona health condition latest news updates

కరోనా సోకి చికిత్స పొందుతున్న అమితాబ్​ బచ్చన్​, అభిషేక్​లు కోలుకుంటున్నట్లు నానావతి ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే మరో ఏడు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని స్పష్టం చేశారు.

Amitabh Bachchan, son Abhishek to remain for in hospital for seven days
బిగ్​బీ, అభిషేక్​
author img

By

Published : Jul 14, 2020, 4:20 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​, ఆయన కుమారుడు అభిషేక్​ బచ్చన్​.. ఇటీవలె కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. బిగ్​బీ, అభిషేక్​ కనీసం మరో ఏడురోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Amitabh Bachchan, son Abhishek to remain for in hospital for seven days
బిగ్​బీ, అభిషేక్​

వీరిద్దరితో పాటు అమితాబ్​ కోడలు ఐశ్వర్యరాయ్​ బచ్చన్​, ఎనిమిదేళ్ల మనవరాలు ఆరాధ్యలకూ కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వీరిని ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచారు అధికారులు. ఈ సందర్భంగా బిగ్​బీ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రముఖులు, సన్నిహితులతో సహా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. మరికొంత మంది ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

మరోవైపు అమితాబ్​ బచ్చన్​ బంగ్లాలో పని చేస్తున్న 26 మంది సిబ్బందికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారందరికీ నెగిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి: 'సుశాంత్​ చెప్పలేనంత వేదన మిగిల్చాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.