ETV Bharat / sitara

సొంతింటిని రూ.23 కోట్లకు అమ్మేసిన అమితాబ్ - Amitabh bachchan news

Amitabh bachchan delhi house: అమితాబ్.. దిల్లీలోని తన సొంత ఇంటిని భారీ ధరకు అమ్మేసినట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ.23 కోట్లని తెలుస్తోంది.

Amitabh bachchan
అమితాబ్ బచ్చన్
author img

By

Published : Feb 3, 2022, 5:08 PM IST

Amitabh bachchan house cost: బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. కెరీర్​ ప్రారంభం నుంచి ముంబయిలోనే ఉండిపోయారు. దీంతో దిల్లీలోని సొంతింటికి వెళ్లడం రావడం చాలావరకు తగ్గిపోయింది. అందుకే ఆ ఇంటిని గతేడాది చివర్లో అమ్మేశారు.

'సోపన్' పేరుతో పిలిచే ఈ బిగ్​బీ ఫ్యామిలీ హౌస్​ను ఆయన కుటుంబానికి సన్నిహితుడైన నెజోన్ గ్రూప్​ సీఈఓ అవనీ బదేర్​కు విక్రయించారు. ఇంటి విలువ దాదాపు రూ.23 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్​ వర్క్​ కూడా పూర్తయింది.

'చెహ్​రే' సినిమాతో ప్రేక్షకుల్ని చివరగా పలకరించిన అమితాబ్.. 'ఝుండ్'తో త్వరలో థియేటర్లలోకి రానున్నారు. దీనితో పాటే 'బ్రహ్మాస్త్ర', ప్రభాస్ 'ప్రాజెక్టు k' చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.

Amitabh bachchan
అమితాబ్ బచ్చన్ 'ఝండ్'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.