ETV Bharat / sitara

బికినీతో షాకిచ్చిన బిగ్​బి అమితాబ్ బచ్చన్​!

author img

By

Published : Apr 29, 2020, 3:20 PM IST

ఇన్​స్టాలో ఫాలోవర్స్​ను పెంచుకునేందుకు ఓ హాస్యభరిత ఫొటోను పోస్ట్​ చేశారు బిగ్​బి​ అమితాబ్​. దీనిని పోస్ట్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు.

Amitabh Bachchan posts his version of bikini pic to gain more followers on Instagram.
ఇన్​స్టాలో ఫాలోవర్స్​ పెరగటానికి బిగ్​బీ ఫన్నీ ఫోస్ట్​

లాక్​డౌన్​ వేళ ఇంటికే పరిమితమైన బాలీవుడ్​ నటుడు అమితాబ్​ బచ్చన్​.. సోషల్​ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. కరోనా​పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఆసక్తికర ఫోటోలను పోస్ట్​ చేస్తున్నారు. ఆయన నటించిన 'మహాన్'​ సినిమా.. ఈరోజుకు(బుధవారం) 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఫన్నీ ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నాడు. దీంతో పాటు ఓ హాస్యభరిత వ్యాఖ్యను జోడించారు. ఇందులో ఆయన లోపల వేసుకునే​ దుస్తులతో కనిపించారు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది. అందరి చేత నవ్వులు పూయిస్తోంది.

"ఇన్​స్టాలో నేటితరంలో చాలా మందికి ఎక్కువగా ఫాలోవర్లు ఉంటున్నప్పుడు నీకు ఎందుకు ఉండటం లేదు? బహుశా నువ్వు ఇన్నర్​ దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయకపోవడమే కారణమణుకుంటా అని కొంతమంది నాతో అన్నారు. అప్పుడే నాకు నేను నటించిన 'మహాన్'​ సినిమాలోని ఈ ఫోజు గుర్తొచ్చింది. అందుకే ఈ ఫొటో​ను పోస్ట్​ చేశా. త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా విడుదలై నేటికి 37 ఏళ్లయింది"

-అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ నటుడు

" class="align-text-top noRightClick twitterSection" data="
">

దీంతో పాటే ఆ సినిమా షూటింగ్​లో తన చేతికి గాయమైన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు అమితాబ్. లాక్​డౌన్ వల్ల ప్రస్తుతం, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యతో కలిసి ఈయన ముంబయిలో ఉంటున్నారు. బిగ్​బి భార్య జయ బచ్చన్ మాత్రం దిల్లీలో చిక్కుకుపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.