బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమాలతో కాదు.. సేవాగుణంతో. బిహార్‌కు చెందిన దాదాపు 2 వేల మందికి పైగా రైతుల రుణాలను స్వయంగా చెల్లించారు అమితాబ్ బచ్చన్.
ఈ వివరాలను స్వయంగా బ్లాగ్‌లో వెల్లడించారు 76 ఏళ్ల నటుడు.
కుమార్తె శ్వేత, కుమారుడు అభిషేక్ చేతుల మీదుగా కొంత మంది రైతులను ఇంటికి పిలిపించి నగదు మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు అమితాబ్ బచ్చన్.
''ఒక వాగ్దానం పూర్తయింది. బిహార్‌లో రుణాలు చెల్లించాల్సిన సుమారు 2,100 మందిని ఎంపిక చేశాం. బ్యాంక్ ఓటీఎస్ ద్వారా నగదు మొత్తాన్ని చెల్లించాం. కొంతమందిని జనక్కు పిలిపించి వ్యక్తిగతంగా అభిషేక్, శ్వేత చేతుల మీదుగా నగదు ఇప్పించా.''
- బ్లాగ్‌లో అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ నటుడు
ముంబయిలోని అమితాబ్ బచ్చన్ నివాసం పేరు జనక్.
పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల కోసం మరో వాగ్దానం చేశానని.. అది కూడా పూర్తి చేస్తానని పేర్కొన్నారు.
''ఇప్పుడు మరో వాగ్దానం నెరవేర్చడానికి జనక్కు వెళ్తున్నా. పుల్వామా దాడిలో అమరుల కుటుంబాలకు కొంత మొత్తాన్ని సాయంగా అందిస్తా.''
- అమితాబ్ బచ్చన్.
అమితాబ్ బచ్చన్ ఇలా రుణాలు చెల్లించడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 1398 మంది రైతులు.. మహారాష్ట్రలో 350 మంది రైతులు రుణమొత్తాన్ని చెల్లించారు.
ఇదీ చూడండి: