ETV Bharat / sitara

పంజాబీ కరోనా గీతంలో అమితాబ్​, కరీనా - panjab covid-19 song

కరోనాపై అవగాహన కోసం ప్రత్యేక గీతం రూపొందించింది పంజాబ్​ ప్రభుత్వం. ఇందులో బాలీవుడ్​ స్టార్​లు అమితాబ్​ బచ్చన్​, కరీనా కపూర్​ సహా పలువురు సినీ, క్రీడా సెలబ్రిటీలు కనువిందు చేశారు.

panjab covid-19 song
పంజాబీ కరోనా గీతంలో అమితాబ్​, కరీనా
author img

By

Published : Jun 3, 2020, 9:44 AM IST

దేశవ్యాప్తంగా కరోనా లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో.. అందరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తోంది పంజాబ్​ ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా 'మిషన్​ ఫతే' పేరుతో ఓ పాటను రూపొందించింది. ఇందులో బాలీవుడ్​ స్టార్​లు అమితాబ్​ బచ్చన్​, కరీనా కపూర్​, గురుదాస్​ మాన్​ సహా కపిల్​దేవ్​, హర్భజన్​ సింగ్​ వంటి ప్రముఖ క్రీడా సెలబ్రిటీలు కనిపించారు.

మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చింది పంజాబ్​ ప్రభుత్వం. ప్రజలు జాగ్రత్తలను పక్కాగా పాటిస్తూ.. బాధ్యతగా ఉండాలని సూచించింది. అప్పుడే కరోనాతో యుద్ధం ముగిసిపోలేదని, ప్రతి ఒక్కరు మాస్కుల వినియోగం, భౌతిక దూరం, చేతులు కడుక్కోవడం వంటి నిబంధనలు పాటించాలని అందులో కోరింది. ఇవే వైరస్ ఎదుర్కోడానికి సహాయపడతాయని తెలిపింది.

ఈ గీతంలో సోనూసూద్​, సోహా అలీఖాన్​, రణ్​దీప్​ హుడా, గిప్పీ గ్రేవల్​, అమ్మీ విర్క్​, జాజీ బీ, బిన్నూ దిల్హన్​, పామీ బాయ్​, జేస్బీర్​ జాసీ, రాజ్​విర్​ జవాండా సహా పలువురు ప్రముఖులు కనువిందు చేశారు. పంజాబీ సంగీత దర్శకుడు, సింగర్​ బి.ప్రాక్​ ఈ పాటను రూపొందించాడు.

  • Battle against #Covid19 is a long-drawn one which can be won only if all of us come together. We need to inculcate the habit of wearing masks, maintain social distancing & frequently washing hands. Sharing this song on #MissionFateh & request all to share for spreading awareness. pic.twitter.com/VHaaxaQqGs

    — Capt.Amarinder Singh (@capt_amarinder) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: తెరుచుకున్న థియేటర్లు.. క్యూ కట్టిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.