ETV Bharat / sitara

'బిగ్​ బీ ప్రశంస మరిచిపోలేనిది' - మళ్లీ రావా హీరోయిన్​ ఆకాంక్ష సింగ్​

తన ప్రతిభను మెచ్చుకుంటూ సొంత చేతిరాతతో బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​(Amitab Bachan) లేఖ రాశారని గుర్తుచేసుకుంది హీరోయిన్​ ఆకాంక్ష సింగ్​. దీంతో పాటు తన కెరీర్​కు సంబంధించిన పలు విషయాలను పంచుకుంది. త్వరలోనే 'క్లాప్‌', 'శివుడు' చిత్రాలతో సందడి చేయనున్న ఈ భామ.. ప్రస్తుతం హిందీలో 'మే డే' సినిమాలో నటిస్తోంది.

Aakanksha Singh
ఆకాంక్ష సింగ్
author img

By

Published : Jun 21, 2021, 6:53 AM IST

'మళ్లీ రావా', 'దేవదాస్‌' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక ఆకాంక్ష సింగ్‌. ప్రస్తుతం హిందీలో 'మే డే' చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. 'క్లాప్‌', 'శివుడు' చిత్రాలతో సందడి చేయనుందీమె. ఈ సందర్భంగా ఆకాంక్షతో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలు మీకోసం..

లాక్‌డౌన్‌ సమయం ఎలా గడిచింది? మళ్లీ సెట్లోకి ఎప్పుడు అడుగు పెడుతున్నారు?

చిత్రీకరణ కోసమే నేను హైదరాబాద్‌కు వచ్చా. ఓ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నా. లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబంతో కలిసి గడిపా.

'క్లాప్‌' సినిమా పూర్తయిందా? మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఆది పినిశెట్టితో కలిసి 'క్లాప్‌'తో పాటు, 'శివుడు' సినిమాలోనూ నటించా. ఈ రెండూ తెలుగు, తమిళంలో రూపొందిన ద్విభాషా చిత్రాలే. ఇవి ఈ ఏడాది విడుదల కానున్నాయి. రెండు సినిమాల్లోనూ బలమైన పాత్రలే చేశా. ఈ చిత్రంలో నా పాత్ర పేరు మిత్ర. హాకీప్లేయర్‌గా కనిపిస్తా. 'శివుడు'లో నటిగా మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే పాత్రని చేశా.

హాకీలో శిక్షణ తీసుకున్నారట కదా?

క్రీడాకారిణిగా నటించడం సవాల్‌తో కూడుకున్న విషయం. శారీరకంగా మానసికంగా ఎంతో బలం కావాలి. అందుకే ప్రతి రోజూ రెండు గంటలపాటు కోచ్‌ ఇఫ్తెకార్‌ అహ్మద్‌ దగ్గర శిక్షణ పొందా. ఇండియన్‌ పోలీస్‌ హాకీ టీమ్‌ క్రీడాకారుడు, కోచ్‌ ఆయన. చెన్నైలో ఆయన దగ్గరే నేను శిక్షణ పొందా.

తెలుగులో మీరు చేసిన సినిమాల మధ్య విరామం కనిపిస్తోంది. కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారా?

నా దృష్టి ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడంపైనే ఉంటుంది. హీరో పక్కన హీరోయిన్‌ అన్నట్టుగా కనిపించే పాత్రల్ని చేయడం నాకు ఇష్టం ఉండదు. అర్థవంతమైన కథలు, పాత్రల్లో భాగం కావాలనేది నా ప్రయత్నం. అందుకే 'మళ్లీ రావా' తర్వాత అలాంటి బలమైన పాత్రల కోసమే ఎదురు చూశా. ఒక ఏడాది తర్వాత 'దేవదాస్‌' సినిమా చేశా. నాగార్జున, నిర్మాణ సంస్థ, నా పాత్ర.. ఇలా అన్నీ చూసుకుని ఆ సినిమాని చేశా. 'దేవదాస్‌' తర్వాత మళ్లీ 'క్లాప్‌', 'శివుడు' సినిమాలు చేశా. అయితే మధ్యలో ఇతర భాషల్లోనూ సినిమాలు చేశా. ఇక నుంచి తెలుగులో నా కెరీర్‌ వేగం పుంజుకుంటుందని నా నమ్మకం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అజయ్‌ దేవగణ్‌తో కలిసి 'మే డే'లోనూ నటిస్తున్నారు కదా. ఆ సినిమా విశేషాలేంటి?

అందులో అజయ్‌ దేవగణ్‌కు(Ajay Devagan) జోడీగా నటించా. అమితాబ్‌ బచ్చన్‌తో(Amitab Bachan) కలిసి తెరను పంచుకున్నా. ఇది నా బాలీవుడ్‌ ప్రవేశంలా భావిస్తున్నా. పది శాతం చిత్రీకరణ మిగిలి ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ఇప్పటికి ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.

ఏ ఇబ్బంది లేదు

చదువు పూర్తవ్వగానే నటనవైపే దృష్టిపెట్టా. స్వతహాగా నేను ఫిజియో థెరపిస్ట్‌ను కాబట్టి, భవిష్యత్తులో ఆ రంగంలో సేవలు అందించే ఆలోచన ఉంది. పెళ్లి తర్వాత హీరోలూ నటిస్తుంటారు కదా. వాళ్లని ఎప్పుడూ ఎవరూ కెరీర్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారని అడగరు. హీరోయిన్లు పెళ్లి తర్వాత నటిస్తే మాత్రం ఈ ప్రశ్న అడుగుతారు. పెళ్లి నా నట ప్రయాణానికి ఏమాత్రం ఇబ్బంది కాలేదు.

తప్పకుండా రాస్తా

రచన నా హాబీ. ఖాళీ సమయాల్లో కథలు, పద్యాలు, పాటలు రాస్తుంటా. కాలేజీ రోజుల్లో నాటకాలు రాసేదాన్ని. రంగస్థలంపై మేం వేసిన నాటకాలే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. నా రచనలు కొన్నిటిని 'మే డే' సెట్లో అమితాబ్‌కు చూపించా. ఆయన నా ప్రతిభను మెచ్చుకుంటూ సొంత చేతిరాతతో లేఖ రాశారు. దాన్ని అందుకున్న క్షణాల్ని ఎప్పటికీ మరిచిపోలేను. సినిమా కథలు భవిష్యత్తులో తప్పకుండా రాస్తా.

ఇదీ చూడండి: Yoga Day: హాట్ హీరోయిన్ల యోగాసనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.