ETV Bharat / sitara

బిగ్​బీ- దీపిక కాంబోలో మూడో సినిమా - ద ఇంటర్న్​ హిందీ రీమేక్​

హాలీవుడ్​ హిట్​ సినిమా 'ది ఇంటర్న్'​ హిందీ రీమేక్​లో అమితాబ్ బచ్చన్​​, దీపికా పదుకొణె కలిసి నటించనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇది.

deepika
దీపిక
author img

By

Published : Apr 5, 2021, 4:40 PM IST

బిగ్​బీ అమితాబ్ బచ్చన్.. ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణెతో మూడోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు వీరిద్దరూ 'పీకూ'లో నటించగా.. ప్రభాస్-నాగ్ అశ్విన్​ ప్రాజెక్టులో చేయనున్నారు.

The Intern
ద ఇంటర్న్

రిషి కపూర్​ స్థానంలో అమితాబ్

హాలీవుడ్​ హిట్ సినిమా 'ది ఇంటెర్న్'ను హిందీ రీమేక్​ చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. రిషి కపూర్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తారని అప్పుడు వెల్లడించారు. ఆ తర్వాత కరోనాతో లాక్​డౌన్ పెట్టడం, కొన్నాళ్ల తర్వాత రిషి కపూర్ అనారోగ్యంతో మరణించడం వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఇప్పుడా ప్రాజెక్ట్​ను మళ్లీ పట్టాలెక్కించాలని నిర్ణయించింది చిత్రబృందం. రిషి కపూర్​ స్థానంలో అమితాబ్​ను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి అమిత్​ రవీందర్​నాథ్​ శర్మ దర్శకత్వం వహించనున్నారు. సునీర్​ ఖేతర్​పాల్​, దీపికా పదుకొణె సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అమితాబ్​ 'చెహ్రే' విడుదల తేదీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.