హీరో సుశాంత్ మరణం తర్వాత బంధుప్రీతి గురించి చిత్రపరిశ్రమ, సోషల్మీడియాలలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ విషయంపై సంగీత దర్శకుడు, గాయకుడు అమిత్ త్రివేది తాజాగా స్పందించాడు. బంధుప్రీతి, స్వాభిమానం లాంటి అంశాలు నటీనటుల మధ్య తప్ప సంగీత ప్రపంచంలో లేవని స్పష్టం చేశాడు.
"బంధుప్రీతి అనేది ఓ వ్యర్థమైన అంశం. ప్రస్తుతం ఈ విషయం వల్ల ప్రజలు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. బంధుప్రీతి అనేదే లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు హీరో, హీరోయిన్ల మధ్య ఉండొచ్చు. ఎవరి కొడుకు దర్శకుడు లేదా సంగీత దర్శకుడు, గాయకుడు అయ్యాడనే విషయం గురించి ఏ తండ్రి బాధపడటం లేదు. కానీ ఈ ప్రశ్నను నటీనటులను మాత్రమే అడగాలి. వారు తప్ప మరెవ్వరూ బాధ పడటం లేదు. నాకు అలాంటి బాధలేదు. సంగీత ప్రపంచంలో బంధుప్రీతికి, స్వాభిమానాలకు తావులేదు"
- అమిత్ త్రివేది, సంగీత దర్శకుడు
సుశాంత్ నటించిన 'కై పో చే' చిత్రానికి సంగీతమందించిన అమిత్ త్రివేది.. తన స్వరాలలో ఆ హీరో ఎప్పుడూ బతికే ఉంటాడని తెలిపాడు. ఈ పాటలు విన్నప్పుడల్లా సుశాంత్ మరణం గుర్తుకు వస్తుందని చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమైనా సరే, అతడలా మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'తో పాటు నాని, సుధీర్బాబుల మల్టీస్టారర్ 'వి' సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు అమిత్ త్రివేది.
ఇదీ చూడండి... సుశాంత్ కేసులో పోలీస్ స్టేషన్కు దర్శకుడు భన్సాలీ