ETV Bharat / sitara

లాక్​డౌన్​లో బోర్ కొట్టకుండా సన్నీ సరికొత్త చాట్ షో - కొవిడ్ 19 వార్తలు

తన అభిమానుల కోసం సరికొత్త ఆన్​లైన్ చాట్ షోను ప్రారంభించింది నటి సన్నీ లియోనీ. ఇందులో భాగంగా రోజూ మధ్యాహ్నం ఓ సెలబ్రిటీతో, కొన్ని కొన్ని ఆసక్తికర విషయాలను చర్చించనుంది.

లాక్​డౌన్​లో బోర్ కొట్టకుండా సన్నీ సరికొత్త చాట్ షో
సన్నీ లియోనీ
author img

By

Published : Apr 2, 2020, 5:22 PM IST

బాలీవుడ్​ నటి సన్నీ లియోనీ.. ఈ లాక్​డౌన్ సమయంలో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైంది. 'లాక్​డ్ అప్ విత్ సన్నీ' పేరుతో డిజిటల్ లైవ్ చాట్ షోను నేటి(గురువారం) నుంచి ప్రారంభించింది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఓ సెలబ్రిటీతో వివిధ విషయాల గురించి చర్చిస్తానని తన ఇన్​స్టాలో రాసుకొచ్చింది. 38 ఏళ్ల యూట్యూబర్​ అనీషా దీక్షిత్​తో తొలిరోజు ముచ్చటించిందీ భామ.

sunny leone anisha dixit
సన్నీ లియోనీ- అనీషా దీక్షిత్

"ఇన్​స్టాలో నెటిజన్లు, నా అభిమానుల కోసమే ఈ చాట్​ షోను మొదలుపెట్టా. ఇందులో చిన్న చిన్న సంభాషణలు, హాస్యభరిత విషయాలు, అతిథి గురించి చర్చిస్తాం" -సన్నీ లియోనీ, నటి

ఈ చాట్​ షోలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో చర్చించనుంది సన్నీ. అదే విధంగా, లాక్​డౌన్ సమయంలో వారేం చేస్తున్నారో అడిగి తెలుసుకోనుంది.

ప్రస్తుతం భారత్​లో లాక్​డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు.. యోగా, లైవ్ మ్యూజిక్, వంటలు తదితర విషయాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.