ETV Bharat / sitara

కలాం గౌరవార్థం 'మిషన్​ కలాం' ఆన్​లైన్​ సెషన్స్​ - అబ్దుల్​ కలాం ఆన్​లైన్​ సెషన్స్​

మాజీ రాష్ట్రపతి అబ్దుల్​ కలాంను స్మరించుకుంటూ నివాళులు అర్పించింది అమెరికాకు చెందిన ఓ ఫిల్మ్​ కంపెనీ. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం 'మిషన్ ​కలాం' పేరుతో 11 వారాల పాటు ఆన్​లైన్​ సెషన్స్​ నిర్వహించనుంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగిస్తారు.

Abdul Kalam
అబ్దుల్​ కలాం
author img

By

Published : Jul 25, 2020, 9:54 PM IST

ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్​ కలాం. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం 2002 ఇదే రోజున భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తాజాగా ఆయనను స్మరించుకుంటూ అమెరికాకు చెందిన పింక్ జాగ్వార్స్​ ఫిల్మ్​ కంపెనీ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం 'మిషన్​ కలాం' పేరుతో ఆన్​లైన్​ కన్​వెన్షన్​ను నేడు​ ప్రారంభించారు. మొత్తం 11 వారాల పాటు దీన్ని నిర్వహిస్తారు. చివరి సెషన్​ అక్టోబర్​ 15న కలాం జయంతి రోజున ముగుస్తుంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగిస్తారు.

అబ్దుల్​ కలాం బయోపిక్​ను తెరకెక్కిస్తున్నట్లు అమెరికన్​ దర్శకుడు జగదీశ్​ దానేటి ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్​ను కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావ​డేకర్​ విడుదల చేశారు.

ఇది చూడండి ఆగస్టు 8న రానా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.