ETV Bharat / sitara

అక్షయ్ 'రామసేతు' నిర్మాతగా ప్రముఖ ఓటీటీ సంస్థ - bollywood news

అక్షయ్ కుమార్ 'రామసేతు' సినిమాకు ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సహ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించారు.

అక్షయ్ 'రామసేతు'కు నిర్మాతగా ప్రముఖ ఓటీటీ సంస్థ
అక్షయ్ కుమార్ రామసేతు
author img

By

Published : Mar 17, 2021, 3:55 PM IST

ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'.. మనదేశంలో సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్​ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న 'రామసేతు'ను అబున్​దంతియా ఎంటర్​టైన్​మెంట్, లైకా ప్రొడక్షన్స్​తో కలిసి నిర్మించనుంది. ఈ విషయాన్ని సంస్థ డైరెక్టర్​ విజయ్ సుబ్రహ్మణ్యం బుధవారం వెల్లడించారు.

ఈ చిత్ర పూజా కార్యక్రమం, అయోధ్యలో గురువారం(మార్చి 18) జరగనుంది. అనంతరం అక్కడే చిత్రీకరణ కూడా చేయనున్నారు. సినిమాలో అక్షయ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నూస్రత్ బరుచా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం.. ఆ తర్వాత కొన్నిరోజులకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

akshay kumar ramsethu movie
అక్షయ్ కుమార్ రామసేతు సినిమా

"భూత, వర్తమాన, భవిష్యత్​ కాలల మధ్య జరిగే కథ 'రామసేతు'. ఇలాంటి అద్భుత కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని అక్షయ్ చెప్పారు.

ఇది చదవండి: సాయిపల్లవికి ఇంట్లో నుంచే పోటీ మొదలైందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.