ETV Bharat / sitara

'మీర్జాపుర్​ 3'కి గ్రీన్​సిగ్నల్​.. త్వరలో షూటింగ్ - అమెజాన్​ ప్రైమ్​ మీర్జాపూర్​

విశేషా ప్రేక్షకాదరణ దక్కించుకున్న 'మీర్జాపుర్' వెబ్ సిరీస్​ మూడో భాగం కూడా ఉందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Amazon Prime Video green-lights Mirzapur 3
'మీర్జాపూర్​ 3' కోసం అమెజాన్​ ప్రైమ్​ గ్రీన్​సిగ్నల్​!
author img

By

Published : Nov 12, 2020, 4:01 PM IST

Updated : Nov 12, 2020, 4:19 PM IST

'మీర్జాపూర్​' రెండో సీజన్​.. విడుదలైన ఏడు రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్​లో అత్యధికులు వీక్షించిన వెబ్​ సిరీస్​గా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా మూడో భాగాన్ని తీయనున్నట్లు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

Amazon Prime Video green-lights Mirzapur 3
'మీర్జాపూర్​ 3' కోసం అమెజాన్​ ప్రైమ్​ గ్రీన్​సిగ్నల్​!

మీర్జాపుర్ కథేంటి?

యాక్షన్ క్రైమ్ థ్రిల్లరగా రూపొందిన ఈ సిరీస్​లో డ్రగ్స్, గన్స్, హత్యల చుట్టూనే కథ సాగుతుంది. అధికారం కోసం ఓ బడా డాన్​కు, సాధారణ వ్యక్తికి మధ్య జరిగిన పోరాటమే ఈ సిరీస్. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, శ్వేతా త్రిపాఠి, రషిక దుగల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అత్యధిక వీక్షణలు​

విడుదలైన 48 గంటల్లోనే చాలామంది నెటిజన్లు రెండో సీజన్​ను వీక్షించారు. దీంతో అమెజాన్ ప్రైమ్​లో అత్యధిక వ్యూస్​ అందుకున్న తొలి సిరీస్​గా 'మీర్జాపుర్' రెండో సీజన్​ నిలిచింది.

మూడో సీజన్ కోసం 'గోలు' వెయిటింగ్​

'మీర్జాపూర్'​ సిరీస్​ను ఆదరించిన వారికి కృతజ్ఞతలు చెప్పిన నటి శ్వేతా త్రిపాఠి.. ఇందులో తాను పోషించిన గోలు పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని తెలిపింది. మూడో సీజన్​ కోసం ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చింది.

సీజన్​ 3 కోసం ఫ్యాన్స్​ ఆత్రుత

'మీర్జాపూర్'​ ​సిరీస్​పై​ అభిమానం పెంచుకున్న ప్రేక్షకులు.. కొత్త సీజన్​ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. "రెండు సీజన్లుగా విడుదలైన మీర్జాపూర్​.. సంచలనంగా మారింది. ఓటీటీలో విడుదలైన​ కొద్దిరోజుల్లోనే సోషల్​మీడియాలో మీమ్స్​ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మా వెబ్​సిరీస్​ను ఆదరించడం పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం" అని నిర్మాతల్లో ఒకరైన రితేశ్ సిద్వానీ అన్నారు.

Last Updated : Nov 12, 2020, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.