ETV Bharat / sitara

'తాండవ్'​ వివాదంపై అమెజాన్​ ప్రైమ్​ క్షమాపణలు

అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన 'తాండవ్​' వెబ్​సిరీస్ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందంటూ..​ ఇటీవలే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటిపై స్పందించిన అమెజాన్​ ప్రైమ్​​.. సిరీస్​ ద్వారా మనోభావాలు దెబ్బతిన్న వాళ్లకు మరోసారి క్షమాపణలు తెలియజేసింది. వివాదాస్పద సన్నివేశాలను తొలగించేసినట్లు వెల్లడించింది.

amazon
అమెజాన్​ ప్రైమ్​
author img

By

Published : Mar 2, 2021, 10:15 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ ప్రధానపాత్రలో నటించిన 'తాండవ్‌' మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న ఆరోపణలతో ఇటీవలే వివాదంలో చిక్కుకుంది. అమెజాన్​ ప్రైమ్​ వేదికగా ప్రసారమవుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను నిలిపివేయాలంటూ నిరసనలు వెల్లువెత్తడం సహా దర్శకనిర్మాతలు, నటులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వెబ్‌సిరీస్‌ వల్ల మనోభావాలు దెబ్బతిన్నవాళ్లకు ఓ సారి క్షమాపణలు చెప్పిన అమెజాన్​ ప్రైమ్ మరోసారి​ క్షమాపణలు చెప్పింది. అంతేకాదు.. ఆ వెబ్‌సిరీస్‌లో వివాదాస్పద సన్నివేశాలను తొలగించేసినట్లు వెల్లడించింది. వీక్షకుల మనోభావాల్ని తాము గౌరవిస్తామని తెలిపింది.

ఇటీవల ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు అలీ అబ్బాస్​ జాఫర్​.. సిరీస్​ ద్వారా మనోభావాలు దెబ్బతిన్న వాళ్లకు క్షమాపణలు తెలియజేశారు. వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన 'తాండవ్‌' జనవరి 15న డిజిటల్ ప్లాట్‌ఫాంపై విడుదలైంది. ఈ వెబ్‌సిరీస్‌లో తమ మతాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇంటర్నెట్‌లో 'బాయ్‌కాట్‌ తాండవ్‌', 'బ్యాన్‌తాండవ్‌' పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి, భాజపా ఎంపీ, యూపీ భాజపా ఎమ్మెల్యేలు కొందరు 'తాండవ్‌'పై ఫిర్యాదులు చేయడం వల్ల యూనిట్‌ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి: క్షమాపణలు చెప్పిన 'తాండవ్' డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.