ETV Bharat / sitara

'పుష్ప' షూటింగ్​ పునఃప్రారంభం నేడే

కరోనాతో తాత్కాలికంగా నిలిచిపోయిన 'పుష్ప' సినిమా షూటింగ్​ మంగళవారం నుంచి పునఃప్రారంభంకానుంది. ఈ సందర్భంగా చిత్రీకరణ ఏర్పాట్లకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. అల్లు అర్జున్​ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్​ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Alluarjun
'పుష్ప
author img

By

Published : Nov 10, 2020, 6:36 AM IST

కథానాయకుడు అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్‌ చిత్రం 'పుష్ప'. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభమైన ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడీ చిత్ర తొలి షెడ్యూల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని మారేడిమిల్లి అడవుల్లో మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇందులో బన్నీ సహా మిగిలిన ప్రధాన తారగణమంతా పాల్గొనబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా వెల్లడించింది.

ఈ సందర్భంగా చిత్రీకరణ ఏర్పాట్లకు సంబంధించిన చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో అల్లు అర్జున్‌.. పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ పాత్ర కోసం తొలిసారి చిత్తూరు యాసలో సంభాషణలు పలకబోతున్నారు. ఆయనకు జోడీగా రష్మిక కనిపించబోతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.