ETV Bharat / sitara

'పుష్ప' సాంగ్​ ప్రోమో.. 'రొమాంటిక్'​ కొత్త ట్రైలర్​​ - పుష్ప సాంగ్​ అప్డేట్​

మిమ్మల్ని పలకరించేందుకు మరిన్ని సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పుష్ప', 'భాగ్​సాలే', 'రొమాంటిక్​', 'జైభీమ్​' చిత్ర సంగతులు ఉన్నాయి.

cinema
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Oct 25, 2021, 5:36 PM IST

అల్లుఅర్జున్​ నటిస్తున్న 'పుష్ప'(Alluarjun pushpa movie) సినిమాలోని 'సామి సామి' సాంగ్​ ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను(pushpa songs update) అక్టోబర్​ 28న ఉదయం 11.07గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్​ అయిన 'దాక్కో దాక్కో మేక'(pushpa dakko dakko meka song), 'శ్రీవల్లి' పాటలు అభిమానులను ఆకట్టుకున్నాఇ. ఈ మూవీలో రష్మిక హీరోయిన్​. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు(pushpa movie music director). మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

భాగ్​సాలే

ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీసింహ(sri simha new movie) నటిస్తున్న నాలుగో చిత్రం 'భాగ్ సాలే'. 'మత్తు వదలరా'(sri simha mathu vadalara), 'తెల్లవారితే గురువారం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీసింహా.. క్రైమ్ కామెడీ జోనర్​లో 'భాగ్ సాలే' చిత్రాన్ని ఎంపిక చేసుకున్నాడు. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమా, సినీవ్యాలీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా భాగ్ సాలే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా శ్రీసింహా నటించిన మూడో చిత్రం 'దొంగలున్నారు' జాగ్రత్త విడుదలకు సిద్ధమవుతోంది.

cinema updates
శ్రీసింహ కొత్త సినిమా షూటింగ్​ షురూ
cinema updates
శ్రీసింహ కొత్త సినిమా షూటింగ్​ షురూ

కొత్త ట్రైలర్​

ఆకాష్‌ పూరీ, కేతికా శర్మ జంటగా(romantic movie trailer) అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించిన చిత్రం 'రొమాంటిక్‌'. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్​ విడుదలై సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని రేపింది. తాజాగా రొమాంటిక్​ బాదాస్​ పేరుతో మరో ట్రైలర్​ను విడుదల చేసింది. ఇందులో ఆకాష్​ మాస్​ డైలాగ్​లతో అదరగొట్టాడు. ఈనెల 29న థియేటర్లలో(romantic movie release date) విడుదల కానున్న ఈ మూవీని పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా, సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూర్చారు.

మరో పాట

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-దర్శకుడు టి.ఎస్‌.జ్ఞానవేల్‌ కలయికలో తెరకెక్కిన సినిమా 'జైభీమ్​'(surya jai bhim movie). నవంబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది(surya jai bhim movie release date). ఈ సందర్భంగా ఈ చిత్రంలో 'థలాకోదుమ్'​ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఏ తప్పు చేయని బలహీన వర్గ మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు సూర్య. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మించారు.

ఇదీ చూడండి: ట్రైలర్స్​తో హిందీ చిత్రాలు.. 'వరుడుకావలెను' సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.