ETV Bharat / sitara

'పుష్ప' క్రెడిట్ మొత్తం ఆయనదే: అల్లు అర్జున్​ - pushpa movie review

తిరుపతిలో 'పుష్ప' సినిమా సక్సెస్​ మీట్​ అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా హీరో అల్లుఅర్జున్​, హీరోయిన్ రష్మిక, సునీల్​, అనసూయ, దర్శకుడు సుకుమార్​ పలు ఆసక్తికరమైన సంగతులను చెప్పారు. ఆ విశేషాలు మీకోసం..

పుష్ప సక్సెస్​ మీట్​, pushpa success meet
పుష్ప సక్సెస్​ మీట్​
author img

By

Published : Dec 21, 2021, 10:58 PM IST

పుష్ప చిత్రంతో తనకు వచ్చిన క్రెడిట్​​ అంతా దర్శకుడు సుకుమార్​కే దక్కుతుందని అన్నారు హీరో అల్లుఅర్జున్​. తన ఫ్యాన్స్​ను​ గర్వించే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. నేడు(మంగళవారం) తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకను నిర్వహించింది చిత్రబృందం. ఈ వేడుకలోనే బన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.

alluarjun rashmika
అల్లుఅర్జున్​ రష్మిక

"నాకు వచ్చిన క్రెడిట్​ అంతా సుకుమార్​కే దక్కుతుంది. ఆయనతో పాటు నా సహ నటులందరికీ కూడా. రష్మికతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అదిరిపోయే ఆల్బమ్​ను ఇచ్చిన దేవీశ్రీకి స్పెషల్​ థ్యాంక్స్​. నా ఫ్యాన్స్​ అందరినీ గర్వించేస్థాయికి తీసుకెళ్తాను" అని అల్లుఅర్జున్​ చెప్పారు.

"నన్ను విలన్​ క్యారెక్టర్​లో ఆదరించిన ప్రేక్షకులకు, సినిమాను సక్సెస్​ చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరున థ్యాంక్స్​. దర్శకుడు సుకుమార్​కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు." అని సునీల్​ అన్నారు.

"సుకుమార్​కు ధన్యవాదాలు. అల్లుఅర్జున్​ నా లైఫ్​లో చాలా ముఖ్యం. ఆయనది చాలా పెద్ద మనసు. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకూ ఆయన స్ఫూర్తి. బన్నీ ట్రాన్స్​ఫర్మేషన్​ వర్ణణాతీతం. ఆయన ఇంత పెద్ద స్టార్​ అవుతారని అసలు అనుకోలేదు. ఈ చిత్రంలో నేను భాగస్వామ్యం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. పార్ట్​ 2లో నా పాత్ర ఇంకా బాగుంటుంది. నా గురువు దైవం సుకుమార్​. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని మాటల్లో చెప్పలేను. రంగమ్మత్త, ద్రాక్షాయనిగా నన్ను చూపించినందుకు థ్యాంక్స్​." అని అనసూయ పేర్కొన్నారు.

"అల్లుఅర్జున్​ 'పుష్ప'గా అదరగొట్టేశారు. ఆయన నటనకు నేను ఫిదా అయిపోయాను. ఆయనకు జాతీయ అవార్డు సహా మిగతా పురస్కారాలు రాకపోతే ఫీల్​ అయ్యే మొదటి వ్యక్తినేనే. సుకుమార్​, డీఎస్పీ సూపర్​. ఇక సునీల్​, అనసూయ ఫస్ట్​లుక్​ వచ్చినప్పుడు అది వారేనని గుర్తుపట్టలేకపోయాను. వాళ్ల నటన అదిరిపోయింది. చిత్రబృందానికి కృతజ్ఞతలు" అని రష్మిక చెప్పారు.

"మా మూడో అన్నయ్య జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనే ఈ సినిమా కథ పుట్టడానికి కారణం. ఈ చిత్రం కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు" అని సుకుమార్​ అన్నారు.

డిసెంబరు 17న విడుదలై 'పుష్ప' చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ భారీ కలెక్షన్లను అందుకుంటోంది. ముఖ్యంగా బన్నీ నటనకు సినీప్రియులు ఫిదా అవుతున్నారు. శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో రెండో భాగం షూటింగ్ ప్రారంభమవుతుంది. దసరా లేదంటే డిసెంబరు కల్లా థియేటర్లలో 'పుష్ప-2' విడుదలవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్​ను ఇమిటేట్​ చేస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.