అల్లు అర్జున్ ప్రేమకథా చిత్రాలతో పాటు మాస్ యాక్షన్ చిత్రాల్లోనూ మెప్పించగలడు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఎర్రచందనం స్మగర్‌గా కనిపించనున్నాడు. రష్మక మందన కథానాయికగా నటిస్తోంది. సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత 'కేజీయఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి.
ప్రశాంత్ ప్రస్తుతం 'కె.జి.ఎఫ్2'తో పాటు ప్రభాస్‌తో కలిసి 'సలార్'న తెరకెక్కిస్తున్నారు. చిత్రం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆ వెంటనే జనవరిలోనే అల్లు సినిమాను ప్రశాంత్ పట్టాలెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారట. ఆ మధ్య ప్రశాంత్ నీల్ హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్‌ను కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు గుప్పుమన్నాయి.
ఇక అల్లు అర్జున్ - కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ, అది తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక ‘వకీల్‌సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో 'ఐకాన్' చేస్తున్నట్లు గతేడాదిలో ప్రకటించారు. కానీ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇటీవల ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు దిల్‌రాజు మీడియా ముందే ప్రకటించారు.