ETV Bharat / sitara

ఏ సిరి పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. యాపిల్ సిరితో అయాన్ - అల్లు అర్జున్ తాజా వార్తలు

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​, తనయుడు అయాన్​కు సంబంధించిన ఓ సరదా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అయాన్ యాపిల్​ వాచ్​లోని సిరితో మాట్లాడుతూ కనిపించాడు.

Allu Arjun and Ayaan
అల్లు అర్జున్
author img

By

Published : Jun 8, 2020, 7:40 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తన పిల్లలతో కలిసి చేసే అల్లరి నెటిజన్లని అలరిస్తుంటుంది. తనయుడు అయాన్‌, తనయ అర్హతో ముచ్చట్లు చెప్పుకొంటున్నప్పటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే హల్‌చల్‌ చేశాయి. తాజాగా మరో వీడియోను షేర్ చేశారు బన్నీ భార్య స్నేహ. అల్లు అర్జున్‌ తన చేతికున్న యాపిల్‌ వాచ్‌లోని సిరితో అయాన్‌ని మాట్లాడించారు.

"నా పేరు సిరి" అని యాపిల్‌ వాచ్‌ చెప్పగానే, "మా బాబాయేనా?" అని అడిగాడు అయాన్‌. అల్లు శిరీష్‌ని వాళ్ల ఇంట్లో ముద్దుగా సిరి అంటారు. యాపిల్‌ సిరిని కాస్త తన బాబాయ్‌ సిరి అనుకున్నాడు అయాన్‌. "నువ్వు పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌" అని అయాన్‌ అడగడం ఆ వీడియోలో కనిపించింది. "ఈ ప్రశ్నకి యాపిల్‌ సిరి దగ్గర కానీ అల్లు సిరి దగ్గర కానీ జవాబు లేదు" అంటూ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు స్నేహ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.