అల్లు అరవింద్ తనయుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన హీరో అల్లు శిరీష్. 'గౌరవం'తో హీరోగా అరంగేట్రం చేశాడు. 'కొత్తజంట', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి '1971' చిత్రంలో నటించాడు.
'1971' సినిమాలోని నటనకుగానూ తాజాగా ఓ అవార్డు అందుకున్నాడు శిరీష్. కొచ్చిలో జరుగుతున్న లులు ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో 'క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం పొందాడు. ఓ తెలుగు నటుడికి ఈ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి.
ఇవీ చూడండి.. ఓటు కోసం క్యూ కట్టిన బాలీవుడ్...