మెగా డాటర్ నిహారిక పెళ్లి ప్రస్తుతం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు బంధువులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. అలాగే ఈ వేడుకకు నిహారిక తన తల్లి పద్మ నిశ్చితార్థానికి కట్టుకున్న చీరలో మెరిసిపోయారు.
వీరి వివాహ వేడుక ఈనెల 9న జరగనున్న నేపథ్యంలో ఇరుకుటుంబాలు కల్యాణ వేదిక అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు ఇప్పటికే చేరుకున్నారు. వీరితో పాటు అల్లు ఫ్యామిలీ, చిరు ఫ్యామిలీ కూడా ప్రత్యేక విమానాల్లో అక్కడికి చేరుకున్నాయి. వారికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి: పెళ్లి కోసం ఉదయ్‌పూర్ బయల్దేరిన కొణిదెల ఫ్యామిలీ