ETV Bharat / sitara

నెల రోజుల షూటింగ్​కు 'పుష్ప'రాజ్​ పయనం - రష్మిక వార్తలు

స్టైలిష్​స్టార్​ అల్లుఅర్జున్​ నటిస్తున్న కొత్త చిత్రం 'పుష్ప'. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో నవంబరు 6 నుంచి ఈ సినిమా షూటింగ్​ చేయనున్నారని సమాచారం. నెలరోజుల షెడ్యూల్​లో కీలక సన్నివేశాలతో సహా ఓ పాటను తెరకెక్కించనున్నారని సమాచారం.

Allu Arjun's 'Pushpa' Shoot To Begin From November in Maredumilli forest
నెల రోజుల షూటింగ్​కు 'పుష్ప'రాజ్​ పయనం
author img

By

Published : Oct 31, 2020, 6:44 AM IST

'పుష్ప' చిత్రీకరణ కోసం అడవుల్లోకి అడుగు పెట్టబోతున్నారు స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్‌. నెల రోజులపాటు ఏకధాటిగా చిత్రీకరణలో బన్ని పాల్గొననున్నారు. అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' తెరకెక్కనున్న మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్​ వచ్చే నెల 6 నుంచి షురూ కాబోతోందని తెలుస్తోంది. అందుకోసం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో సర్వం సన్నద్ధం చేస్తున్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. అల్లు అర్జున్‌ మాస్‌ పాత్రలో, పుష్పరాజ్‌ అనే యువకుడిగా కనిపించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్న నటించనున్నారు. ఈ సినిమా కోసం చిత్తూరు యాసలో వీరిద్దరూ తర్ఫీదు పొందారు. నెల రోజుల షెడ్యూల్​లో కీలకమైన సన్నివేశాలతో పాటు పాటనూ తెరకెక్కిస్తారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.