ETV Bharat / sitara

'పుష్ప' ఫస్ట్‌ సింగిల్‌ కోసం చిత్రబృందం భారీ ప్లాన్​ - dakko dakko meka song

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ - దర్శకుడు సుకుమార్​ కాంబినేషన్​లో రూపొందుతోన్న హ్యాట్రిక్​ చిత్రం 'పుష్ప'. సోమవారం చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్​ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఫస్ట్​ సింగిల్​ రిలీజ్​ డేట్​ ప్రకటించారు.

Allu Arjun's Pushpa first single on August 13th in 5 languages
'పుష్ప' ఫస్ట్‌ సింగిల్‌ కోసం చిత్రబృందం భారీ ప్లాన్​
author img

By

Published : Aug 2, 2021, 1:43 PM IST

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కతోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. సోమవారం దేవిశ్రీ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప' ఆడియోపై చిత్రబృందం ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఆగస్టు 13న 'పుష్ప' ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ సారథ్యంలో ఐదు భాషల్లో విశాల్‌ దడ్లానీ (హిందీ), విజయ్‌ ప్రకాశ్‌ (కన్నడ), రాహుల్‌ నంబియార్‌ (మలయాళం), శివమ్‌ (తెలుగు), బెన్నీ (తమిళం) అనే ఐదుగురు ప్రముఖ గాయకులు ఆలపించనున్నారు.

బన్నీ-సుకుమార్‌-దేవిశ్రీ కాంబిలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇందులో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా ఊరమాస్‌ లుక్‌లో దర్శనమివ్వనున్నారు. రష్మిక కథానాయిక. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

రెండు భాగాలుగా విడుదల కానున్న 'పుష్ప' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. 'పుష్ప' మొదటి భాగం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'పుష్ప' ప్రమోషన్స్‌ కోసం చిత్రబృందం భారీగా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో సన్నీలియోనీ ఆడిపాడే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి.. 'పుష్ప' ఐటమ్ సాంగ్​ కోసం సన్నీ లియోనీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.