ETV Bharat / sitara

బుట్టబొమ్మ పాట పాడిన మరో బుట్టబొమ్మ - ALLU ARHA SANG BUTTA BOMMA

అల్లు అర్జున్ కూతురు అర్హ.. బుట్టబొమ్మ పాట పాడి అలరించింది. ఈ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది బన్నీ సతీమణి స్నేహరెడ్డి.

బుట్టబొమ్మ పాట పాడుతున్న మరో బుట్టబొమ్మ
బుట్టబొమ్మ పాడ పాడుతున్న అల్లు అర్హ
author img

By

Published : May 5, 2020, 9:55 AM IST

'అల వైకుంఠపురములో' సినిమా వచ్చి కొన్ని నెలలు అవుతున్నా.. అందులోని 'బుట్టబొమ్మ' పాటకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే దేశాల దాటి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఈ గీతానికి టిక్​టాక్ చేయగా, మరెంతో మంది సెలబ్రిటీలు దీనికి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ కూతురు అర్హ.. 'బుట్టబొమ్మ' అంటూ పాడుతూ కనిపించింది. ఈ వీడియోను అల్లు అర్జున్ సతీమణి ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. 'మా చిన్ని బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ సాంగ్ పాడుతోంది. క్వారంటైన్ ఫన్' అని రాసుకొచ్చింది.

అంతక ముందు ఇదే చిత్రంలోని 'ఓ మై గాడ్ డాడీ' లిరికల్ పాట కోసం అన్న అయాన్​తో కలిసి డ్యాన్స్ చేసింది అర్హ. ఆ తర్వాత కొన్ని రోజులకు 'రాములో రాములో' పాటలో బన్నీ దోశ స్టెప్పు వేశాడని ఫన్నీ కామెంట్ చేసింది.

బన్నీ-పూజా జంటగా కనిపించిన 'బుట్టబొమ్మ' పాట.. ఇప్పటికే యూట్యూబ్​లో 150 మిలియన్ల వ్యూస్​కు పైగా​ దక్కించుకోవడం మరో విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.