ETV Bharat / sitara

త్రివిక్రమ్​ దర్శకత్వంలో మరోసారి బన్నీ! - త్రివిక్రమ్​

'అల.. వైకుంఠపురములో' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో మరో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్​తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన మాటల మాంత్రికుడు.. వచ్చే ఏడాది బన్నీతో కొత్త సినిమా తెరకెక్కించనున్నాడని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Allu Arjun-Trivikram combo will planning for Another movie?
త్రివిక్రమ్​ దర్శకత్వంలో మరోసారి సిత్తరాల సిరపడు
author img

By

Published : Mar 27, 2020, 1:53 PM IST

ఇటీవలే 'అల వైకుంఠపురములో' చిత్రంతో బాక్సాఫీస్​ వద్ద ఘనవిజయం అందుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్‌. దీంతో అతడి తదుపరి సినిమాపై అందరి దృష్టి నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌తో తర్వాతి సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు త్రివిక్రమ్‌. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 2021 వేసవిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌తో మరో చిత్రం చేయబోతున్నాడని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బన్నీతో మూడు చిత్రాలు చేసిన త్రివిక్రమ్‌ మరోసారి కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాడట. కొత్తగా తయారు చేసిన కథలో బన్నీ ప్రధానపాత్రలో నటిస్తున్నాడని సమాచారం.

ఎన్టీఆర్‌తో చిత్రం పూర్తయ్యాక బన్నీతో చేసే అవకాశాలున్నాయని టాక్‌. ఈ వార్తలపై పూర్తి స్పష్టత రావాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ 'ఆర్​ఆర్​ఆర్'​(రౌద్రం రణం రుధిరం)తో బిజీగా ఉన్నాడు.

ఇదీ చూడండి.. రామ్​చరణ్​కు క్షమాపణ చెప్పిన ఎన్టీఆర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.