ETV Bharat / sitara

యూట్యూబ్​లో సందడి చేస్తున్న బన్నీ, సాయి పల్లవి - సారంగదరియా యూట్యూబ్ వ్యూస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' చిత్రం యూట్యూబ్​లో దూసుకెళ్తోంది. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన 'లవ్​స్టోరీ' చిత్రంలోని 'సారంగదరియా' సాంగ్ 150 మిలియన్ల వ్యూస్​ను దక్కించుకుంది.

llu Arjun, Sai Pallavi
బన్నీ, సాయి పల్లవి
author img

By

Published : Apr 23, 2021, 3:36 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సాయిపల్లవి యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నారు. మిలియన్ల కొంది వ్యూస్‌తో ఈ ఇద్దరు తారలు ఎవరికి వారే సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసుకుంటున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరీ'. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట ఇప్పటికే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. అతి తక్కువ సమయంలో ఎంతోమందిని ఆకర్షించింది. కాగా, తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియో యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'లవ్‌స్టోరీ' విషయానికి వస్తే శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరో. ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' యూట్యూబ్‌లో వీక్షకులను బాగా ఆకర్షిస్తోంది. బన్నీ-హరీశ్‌శంకర్‌ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటివరకూ 100 మిలియన్ల మంది వీక్షించారు. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బన్నీ-పూజాహెగ్డే జోడీ మొదటిసారి ఈ చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.