ETV Bharat / sitara

ఆ బాలీవుడ్ చిత్రాన్ని 20 సార్లు చూశా: బన్నీ - ఆ బాలీవుడ్ చిత్రాన్ని 20 సార్లు చూశా: బన్నీ

ఇటీవలే 'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన బన్నీ తనకు ఇష్టమైన బాలీవుడ్ సినిమాల గురించి చెప్పారు.

అల్లు
అల్లు
author img

By

Published : May 25, 2020, 12:11 PM IST

బాలీవుడ్‌లో తెరకెక్కిన మూడు చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ తెలిపారు. ఇటీవల ఓ ఆంగ్ల‌ పత్రికతో ముచ్చటించిన బన్నీ తనకు బాలీవుడ్‌ పరిశ్రమపై అభిమానముందని చెప్పారు. అనంతరం తనకు నచ్చిన బాలీవుడ్‌ చిత్రాల గురించి తెలియజేశారు.

గల్లీబాయ్
గల్లీబాయ్

"బాలీవుడ్‌లో తెరకెక్కిన అన్ని చిత్రాల్లో ఓ మూడింటిని ఎక్కువ సార్లు వీక్షించా. అలా నాకిష్టమైన చిత్రాల్లో 'జో జీతా వహీ సికందర్‌' ఒకటి. 20 కంటే ఎక్కువ సార్లే దానిని చూశా. అలాగే షారుఖ్‌ నటించిన 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' చిత్రాన్ని కూడా ఎక్కువసార్లు వీక్షించా. ఇప్పటికీ ఆ సినిమాని చూస్తే వ్యక్తిగతంగా ఓ మధురానుభూతిని పొందుతా. ఇటీవల కాలంలో విడుదలైన 'గల్లీబాయ్‌'ని 3-4 సార్లు చూశా. వ్యక్తిగతంగా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది."

-అల్లు అర్జున్, హీరో

'అల.. వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం 'పుష్ప'. 'ఆర్య', 'ఆర్య-2' చిత్రాల తర్వాత బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో‌ చిత్రమిది. ఇందులో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు. ఇప్పటికే ప్రారంభమైన 'పుష్ప' షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంపాటు వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.