ETV Bharat / sitara

Pushpa trailer: అల్లు అర్జున్ 'పుష్ప' ట్రైలర్​ వచ్చేసింది.. - సుకుమార్ అనసూయ

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన 'పుష్ప' ట్రైలర్ వచ్చేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్, డైరెక్టర్ సుకుమార్ టేకింగ్.. తెగ అలరిస్తోంది.

allu arjun pushpa trailer
పుష్ప ట్రైలర్
author img

By

Published : Dec 6, 2021, 9:24 PM IST

Pushpa trailer: 'పుష్ప' ట్రైలర్ వచ్చేసింది. అల్లు అర్జున్​గా హీరోగా నటించిన ఈ సినిమా.. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పక్కా మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా 'పుష్ప'ను తెరకెక్కించారు. ఇందులో బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

శేషాచలం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు చిత్రంపై అంచనాల్ని తెగ పెంచేస్తున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానుల్లో ఆత్రుత కలిగిస్తున్నాయి.

ఈ సినిమాలో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, త్వరలో ఆ పాటను రిలీజ్ చేయనున్నారు. స్పెషల్ సాంగ్ చేయడం సమంతకు ఇదే తొలిసారి కావడం విశేషం.

'పుష్ప'.. అల్లు అర్జున్-సుకుమార్​కు హ్యాట్రిక్ చిత్రం. ఆర్య, ఆర్య 2 సినిమాతో సినీ ప్రేమికుల్ని అలరించిన ఈ జోడీ.. ఇప్పుడు రాబోయే 'పుష్ప' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.